- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తరపున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం!
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇవాళ నలుగురు కీలక నేతలు హస్తం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం కాగా.. మరో ముఖ్య నేత షాకిచ్చారు. స్వయానా టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. తాను తెలంగాణ వాదిని అని చెప్పారు. బీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పేరెంట్ ఉన్న పార్టీలోకి వెళ్తున్నానని ప్రకటించారు. గతంలో యూత్ కాంగ్రెస్‌లో పనిచేసినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో చేరాక పార్టీలో ఎలాంటి సూచనలు చేసినా కట్టుబడి ఉంటానని అన్నారు.
హైదరాబాద్‌లో ప్రతీ గల్లీ గల్లీ నాకు తెలుసని తెలిపారు. అర్బన్ ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు హైదరాబాద్, మల్కాజ్‌గిరి ఏ టికెట్ ఇచ్చినా తనకోసం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నాగార్జున సాగర్ టికెట్ ఆశించి నిరాశ చెందారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో అయినా టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డారు. దీంతో బీఆర్ఎస్‌కు షాకివ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే, చంద్రశేఖర్ 2014 ఎన్నికల వేళ బీఆర్ఎస్‌లో చేరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలో 47,292 ఓట్లు సాధించిన ఆయన... తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో 11,056 ఓట్ల తేడాతో ఓడిపోయారు.