BRSకు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

by Disha Web Desk 4 |
BRSకు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కారు పార్టీకి గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపారు. తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. ఇటీవల మల్కాజ్‌గిరి టికెట్ అవకాశవాది అయిన రాగిడి లక్ష్మారెడ్డికి పార్టీలో చర్చించకుండా ఇచ్చారు. అందుకే ఉద్యమ సహచరుడు ఈటలకు మద్దతుగా ఆయనను గెలిపించుకోవాలనుకుంటున్నాను.. అని లేఖలో సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story