BJP ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట

by Gantepaka Srikanth |
BJP ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(BJP Telangana) కీలక నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌(BJP MLA Raja Singh)కు భారీ ఊరట లభించింది. ఆయన మీదున్న విద్వేషపూరిత ప్రసంగం కేసులను శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు ఐదు పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్‌పై విద్వేషపూరిత ప్రసంగం కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులపై ఇవాళ విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి రిపీట్ కావొద్దని హెచ్చరిస్తూ కొట్టివేసింది.

మరోవైపు.. ఇటీవల మహాశివరాత్రి పండుగ(Maha Shivaratri Festival) వేళ కూడా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా హిందువులు అందరూ తప్పకుండా హిందువుల వద్దనే పూజ సామాన్లు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. రోజుల తరబడి స్నానం చేయకుండా.. గొడ్డు మాంసం తిని పూజా సామాగ్రి(Pooja Materials) అమ్ముతున్న వాళ్ల దగ్గర మహా శివరాత్రికి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయవద్దంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు రెండ్రోజుల పాటు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.

Next Story