BIG News: రుణమాఫీ కాని వారికి భారీ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2024-08-15 16:31:49.0  )
BIG News: రుణమాఫీ కాని వారికి భారీ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీ కాని వారికి సీఎం రేవంత్‌రెడ్డి భారీ గుడ్‌న్యూస్ చెప్పారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆయన గొల్కొండలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. రుణమాఫీ కాని అన్నదాతలు ఎవరూ నిరుత్సాహపడొద్దని, త్వరలోనే వారందరి కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణాలు మాఫీ అవుతాయని భరోసానిచ్చారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed