- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG News: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. 4 కొత్త మెడికల్ కాలేజీలకు పర్మీషన్ గ్రాంటెడ్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. పెండింగ్‌లోని మెడికల్ కాలేజీల పర్మిషన్లను తీసుకువచ్చింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. 2024 - 25 అకాడమిక్ ఇయర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 8 కాలేజీలను అప్లయ్ చేయగా, గత కొన్ని రోజులు క్రిందట కేవలం నాలుగు కాలేజీలకు మాత్రమే అనుమతులు వచ్చాయి. ములుగు, నర్సంపేట్, గద్వాల, నారాయణపేట్ కాలేజీలకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్భుల్లాపూర్, మెదక్ కాలేజీలకు అనుమతులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆయా కాలేజీల పర్మిషన్ల కోసం హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడారు. నేరుగా హెల్త్ సెక్రటరీని డిస్కషన్స్ కోసం ఢిల్లీకి పంపించారు. దీంతో పెండింగ్‌లోని కాలేజీలకు అనుమతులు ఇస్తున్నట్లు మంగళవారం కేంద్రం నుంచి ఓ లేఖ వచ్చింది. దీంతో ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, 8 కాలేజీలు కలిపి 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
గత సర్కార్ నిర్లక్ష్యంతో సమస్యలు..
గత ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ప్రతిపాదికన సంఖ్యను పెంచుకుంటూ వెళ్లారు. ఈ మేరకు అనుమతులు కోసం విడతల వారీగా కేంద్రానికి ప్రపోజల్స్ పంపించారు. కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ వంటి వేమీ లేకుండా ముందుకు సాగారు. దీన్ని గుర్తించిన ఎన్‌ఎంసీ అనుమతుల అంశంపై కొర్రీలు పెట్టింది. నిబంధనలు పాటించాలని పలుమార్లు ఎన్‌ఎంసీ హెచ్చరించింది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పెండింగ్‌లో కాలేజీలకు క్రమంగా స్టాఫ్, సౌకర్యాలు కల్పించగా ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయి. ఇదిలా ఉండగా, కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, అడిషనల్ డీఎంఈ విమలా థామస్, ఇతర ఉన్నతాధికారులను మంత్రి అభినందించారు. సర్కార్ దవాఖాన్లు, కాలేజీల విషయంలో ప్రభుత్వం కమిట్‌మెంట్, చిత్తశుద్ధితో ఉందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.