BIG News: అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీపై సీఎం రేవంత్‌‌రెడ్డి కీలక ప్రకటన

by Shiva |
BIG News: అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీపై సీఎం రేవంత్‌‌రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసేందుకు సర్కార్ సయాయత్తం అవుతోంది. ఈ మేరకు అందుకు సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయితే, పంట రుణాల మాఫీకి రేషన్‌కార్డు ప్రమాణికం కాదని, కేవలం కుటుంబాన్ని గుర్తిస్తామని తెలిపారు. పాస్‌బుక్ ఆధారంగానే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామనిచ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రంలోను బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్న అవకతవకల గురించి వాస్తవాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిస్తామని అన్నారు.



Next Story