- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG NEWS : నిరుద్యోగులకు శుభవార్త.. యూత్ డే సందర్భంగా మెగా జాబ్ మేళ (రిజస్ట్రేషన్‌కు క్యూ ఆర్ స్కాన్ చేయండి)
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైవేటు రంగ సంస్థలలో ఉపాధి కల్పించేందుకు గాను స్వచ్ఛంద సంస్థలు ట్రస్టులు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న సికింద్రాబాద్‌లోని కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్, బోట్స్ క్లబ్ సమీపంలో మెగా జాబ్ మేళా జరగనుంది ఉదయం 10గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగ యువతీ యువకులు వయసు18 ఏళ్ల నుంచి 35 మధ్య ఉండాలి. అదేవిధంగా ఈ మెగా జాబ్‌మేళాలో దాదాపు 65 కంపెనీలు పాల్గొనబోతున్నాయి. యూత్ డేను పురస్కరించుకుని మొత్తం 5 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ మెగా జాబ్ మేళాలో పది, ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్‌మెంట్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఎ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంపీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగాలు టీఎస్ స్టేప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈహెల్ప్ లైన్ నెంబర్ 7097655912 లేదా 9642333668 లేదా 888671191 ఫోన్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు.