- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG News: అన్నదాతలకు శుభవార్త.. రేపు మూడో విడత రైతు రుణమాఫీ
దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇచ్చి హామీ మేరకు రైతు రుణమాఫీ మూడో విడత రుణమాఫీ నిదులను ఖమ్మం జిల్లా వేదికగా విడుదల చేయనుంది. మొదటి విడతలో భాగంగా జూలై 18న లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు 11,34,412 మంది రైతుల కోసం 6,034.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. జూలై 29న రెండో దశలో 6,40,823 మంది రైతులకు రూ. 6,190.01 కోట్లు ఖర్చు చేసి లక్షన్నర లోపు రుణాలను సర్కార్ మాఫీ చేసింది. ఇక చివరి విడతలో భాగంగా ఆగస్టు 15న దాదాపు 6 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసేందుకు గాను రూ.8.5 వేల కోట్లను సమీకరించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ ఇవాళ స్వదేశానికి తిరిగి రానున్నారు. రేపు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించి సీతారామ ప్రాజెక్టు పంపు హౌజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం వైరాలో రైతు రుణమాఫీ బహిరంగ సభకు హాజరై రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిధులను విడుదల చేయనున్నారు.