బిగ్ బ్రేకింగ్ : శ్రీశైలం ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

by Sathputhe Rajesh |
బిగ్ బ్రేకింగ్ : శ్రీశైలం ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
X

దిశ, అచ్చంపేట : ఆంధ్రప్రదేశ్ ‌లోని శ్రీశైలం దోర్నాల ప్రధాన హైవే ఘాట్ రోడ్డుపై శనివారం ఓ ప్రైవేటు మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన భక్తులు శ్రీశైల మల్లన్న దైవదర్శనానికి వెళుతున్న క్రమంలో దోర్నాల శ్రీశైలం ప్రధాన ఘాట్ రోడ్డు చిన్నారుల సమీపంలోని దయ్యాల టర్నింగ్ వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మందికి గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి 108కి సమాచారం అందించడంతో క్షతగాత్రులందరినీ 108 వాహనం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు ఆసుపత్రికి వైద్య సదుపాయాలు అందించేందుకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed