BIG BREAKING: తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము

by Shiva |   ( Updated:2024-07-28 03:19:29.0  )
BIG BREAKING: తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు కొత్త గవర్నర్‌గా త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఝార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రమేష్ బైస్‌ను కేంద్రం తప్పించింది. 1957 ఆగస్టు 15న జిష్ణుదేవ్ వర్మ జన్మించారు. ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మ భూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో జాయిన్ అయ్యారు. త్రిపుర రెండో డిప్యూటీ సీఎంగా 2018 నుంచి 2023 వరకు ఆయన సేవలు అందించారు.

ఆయా రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన గవర్నర్లు వీరే..!

రాజస్థాన్ బీజేపీ సీనియర్ లీడర్ ఓం ప్రకాష్ మాథుర్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించింది.

రాజస్థాన్ గవర్నర్‌గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్ రావు బాగ్డేని కేంద్రం నియమించింది.

యూపీకి చెందిన కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్‌ను ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమించింది.

అస్సాం మాజీ ఎంపీ రమెన్ డేకాను ఛత్తీస్ గఢ్ గవర్నర్‌గా కేంద్రం అపాయింట్ చేసింది.

అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్‌గా, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.

కర్ణాటక మాజీ మంత్రి సీహెచ్. విజయశంకర్‌ను మేఘాలయ గవర్నర్‌గా, 1979 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కె.కైలాసనాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్రం నియమించింది.

Advertisement

Next Story

Most Viewed