వాహనదారులకు BIG అలర్ట్.. పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారా?

by GSrikanth |
వాహనదారులకు BIG అలర్ట్.. పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారా?
X

దిశ, వెబ్‌డెస్క్: పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ రేపటి(జవవరి 10)తో ముగియనుంది. ఈ క్రమంలో వాహనదారులను రాష్ట్ర పోలీసులు మరోసారి అప్రమత్తం చేశారు. ఇప్పటివరకు క్లియర్ చేయనివాళ్లు వెంటనే చేసుకోవాలని సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుమీద ఎవరైనా పోలీసులకు చిక్కినప్పుడు పెండింగ్ చలాన్లు క్లియర్ చేయించడంతో పాటు బండి సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

ద్విచక్ర వాహనాలపై 80 శాతం, నాలుగు చక్రాల వాహనాలపై 60 శాతం రాయితీ కల్పించినట్లు మరోసారి గుర్తుచేశారు. గడువు ముగిశాక రాయితీ అందుబాటులో ఉండబోదని.. చలాన్లు వందశాతం చెల్లించాల్సిందే అని సూచించారు. మీసేవతో పాటు ఆన్‌లైన్, యూపీఐ ద్వారా కూడా ఈ చలాన్లు చెల్లించే ఛాన్స్ ఉందని చెప్పారు. ఏదైనా సందేహం ఉంటే 040-27852721, 8712661690 వాట్సాప్ నెంబర్లలో అధికారులను సంప్రదించేందుకు అవకాశం ఉందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed