తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్స్ అప్డేట్

by GSrikanth |
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్స్ అప్డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు జరగనున్నట్లు బోర్డు సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీరోజు రెండు సెషన్లుగా ఉదయం 9-12 గంటలు, 2-5 గంటల స్లాట్‌లలో జరగనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన ఫ్రెష్ బ్యాచ్‌కు ఫిబ్రవరి 16న ఇంగ్లీషు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాత బ్యాచ్ విద్యార్థులకు (2023-24కు ముందు చేరి బ్యాక్‌లాగ్ ఉన్నట్లయితే) ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 17న ఉదయం 10.00 గంటల నుంచ మధ్యాహ్నం 1.00 గంట వరకు జరగనున్నాయి. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరగనున్నాయి.

రాష్ట్రం మొత్తం మీద ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం 2,032 కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటికి సుమారు 3.21 లక్షల మది విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందని వివరించారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2.17 లక్షల మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1.04 లక్షల మంది ఉంటారని తెలిపారు. ఒకేషనల్ కోర్సులకు 94,819 మంది ఉంటే ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 48,277 మంది, సెకండియర్‌కు 46,542 మంది చొప్పున ఉన్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed