100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని అనలేదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 13 |
100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని అనలేదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో:రైతు రుణమాఫీ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రైతు రుణమాఫీ తాము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పలేదని అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పామని చెప్పామని తప్పనిసరిగా చేసి చూపిస్తామన్నారు. ఆర్థిక పరిస్థిని బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత స్పష్టంగా విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తామిన్నారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో 'విద్యుత్-త్రాగునీరు-ఆర్థికం' అనే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతురుణ మాఫీపై రాజకీయం హాట్ హాట్ గా సాగుతున్న వేళ భట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. ఎవరెన్ని కుట్రలు చేసిన ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

తాము అధికారం దిగిపోయే నాటికి ఖజానాలో రూ.7 వేల కోట్లు బ్యాలెన్స్ ఉందని బీఆర్ఎస్ చెబుతోందని కానీ నిజానికి మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాష్ట్ర ఖజానా రూ.3,960 కోట్లు మైనస్ లో ఉందన్నారు. రూ.7 వేల కోట్లు ఎవరి అకౌంట్ లోకి పోయాయని ప్రశ్నించారు. సాగునీరు, విద్యుత్ పై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందని, ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం జరుగుతుందని అందుకే ప్రజలకు వాస్తవాలను చెప్పాలనే తాను ఇక్కడికి వచ్చానన్నారు. 4 నెలల్లో 26 వేల కోట్ల అప్పులు కట్టామని చెప్పారు. ప్రజలకు ఆందోళన కలిగించే ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

Next Story

Most Viewed