- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఢిల్లీకి బయలుదేరిన భట్టి, ఉత్తమ్.. సీఎం ఎంపికపై తీవ్ర ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పేరును సోమవారమే ప్రకటిస్తారని.. ప్రమాణ స్వీకార కార్యక్రమం సైతం అదే రోజు ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సీఎం ఎంపిక వాయిదా పడింది. సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సీఎల్పీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి పంపిన ఇన్‌ఛార్జ్‌లు.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ సీఎం అభ్యర్థి పేరును ఇవాళ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు పయనం అయ్యారు.
ఢిల్లీలో భట్టి, ఉత్తమ్ ఇవాళ మధ్యా్హ్నం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, మంత్రిమండలి ఎంపిక గురించి వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నెక్ట్స్ సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సీఎల్పీ భేటీలోనూ రేవంత్ రెడ్డి వైపే మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపినట్లు టాక్. ఈ క్రమంలో సీఎం రేసులో ఉన్న ఉన్న భట్టి, ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానుండటం హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నేతల సడెన్ హస్తిన టూర్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక, తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరు అవుతారా అని రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read More: మంత్రి పదవులపై ఆశలు.. జూపల్లికి దక్కనున్న కీలక శాఖ..?