- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BC Commission : బీసీ కమిషనా.. కాంగ్రెస్ కమిషనా ? : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర బీసీ కమిషన్(BC Commission) కాంగ్రెస్(Congress) కమిషన్‌లా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) , డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(Dr. Kalvakuntla Sanjay)లు విమర్శి్ంచారు. బీసీ కమిషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ విచారణకు జిల్లాలోని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల ప్రతినిధులు ప్రజలు అభిప్రాయాలు చెప్పేందుకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి, సంజయ్ లు మాట్లాడుతూ కోర్టు బీసీ కమిషన్ కు విలువ లేదన్నప్పటికి తాము కమిషన్ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వస్తే మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం కమిషన్ ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నాయకుడు కూడా రాలేదన్నారు.
కమిషన్ మీద కాంగ్రెస్‌కు నమ్మకం లేదు కాబట్టే ఎవరు రాలేదని ఎద్దేవా చేశారు. తాము ఇక్కడికి వస్తే ప్రజా ప్రతినిధులం అని కూడా చూడకుండా కనీసం మాట్లాడేందుకు సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అసలు ఇది బీసీ కమిషనా లేక కాంగ్రెస్ కమిషనా అని ప్రశ్నించారు. డెడికేటెడ్ కమిషన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ నియామకం చేయాలన్నారు. 42శాతం రిజర్వేషన్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్ధతునిస్తుందన్నారు.
బీసీలపై బీఆర్ఎస్ కు ఉన్న చిత్తశుద్ధికి కేసీఆర్ పాలనలో బీసీల కోసం చేసిన ఖర్చు నిదర్శనమన్నారు. 1994 నుండి 2004 వరకు అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం బీసీలకు రూ. 2000 కోట్లు ఖర్చు పెట్టిందని, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రూ. 16,000 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రూ. 45,000 కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. కాగా వచ్చే నెల 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనున్నది.