- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బతుకమ్మ’ సంబురాలకు సర్వం సిద్ధం.. సీఎం రేవంత్, మంత్రుల ఆధ్వర్యంలో..
దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ సంబురాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వరుసగా తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు క్యాలెండర్ షెడ్యూలు తయారుచేసింది. మహిళా సంఘాలు, వివిధ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ప్రతీ రోజు రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులంతా ఆయా ఆఫీసుల ప్రాంగణాల్లోనే బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు.
తొలి రోజున సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ విభాగం) నిర్వహించే వేడుకల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటున్నారు. రవీంద్రభారతిలో సాయంత్రం జరిగే కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. చివరి రోజున ట్యాంక్‌బండ్‌పై జరిగే పలు వేడుకలతో బతుకమ్మ సంబురాలు ముగియనున్నాయి. ఆ రోజున జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
అమరజ్యోతి దగ్గర నుంచి ట్యాంక్‌బండ్ వరకు సుమారు వెయ్యి మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వెళ్లి సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. మహిళలంతా తలా ఒక బతుకమ్మతో పాటు ఆరు అడుగుల ఎత్తయిన భారీ సైజు బతుకమ్మను కూడా అక్కడే తయారు చేసి కళాకారుల ప్రదర్శనల నడుమ ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారు. అక్కడ భారీ స్థాయిలో నిర్వహించే కలర్‌ఫుల్ లేజర్ షో కార్యక్రమంలో సీఎం సహా మంత్రులు, అధికారులు పాల్గొంటారు.
షెడ్యూల్ ఇలా..
- అక్టోబరు 2 ఎంగిలిపూల బతుకమ్మ
- అక్టోబరు 3 అటుకుల బతుకమ్మ
- అక్టోబరు 4 ముద్దపప్పు బతుకమ్మ
- అక్టోబరు 5 నానబియ్యం బతుకమ్మ
- అక్టోబరు 6 అట్ల బతుకమ్మ
- అక్టోబరు 7 అలక బతుకమ్మ (అర్రెం)
- అక్టోబరు 8 వేపకాయల బతుకమ్మ
- అక్టోబరు 9 వెన్నముద్ద బతుకమ్మ
- అక్టోబరు 10 సద్దుల బతుకమ్మ