- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాసర ట్రిపుల్ఐటి విద్యార్థిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: R S Praveen Kumar
దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దాని పర్యావసనమే గత నెల 1200 మంది విద్యార్థులు విష ఆహారం తిని ఆసుపత్రి పాలైనరాని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై 15 రోజులు విద్యార్థులు సమ్మె చేసినా కూడా ప్రభుత్వం గుండె కరుగలేదని వాపోయారు. మంగళవారం రాథోడ్ సురేష్ అనే బాసర ట్రిపుల్ ఐటీ పేద విద్యార్థి ఉరివేసుకొని చనిపోవడం బాధాకరమని అన్నారు.
అతను ఉరి వేసుకుని ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నిజామాబాద్ హాస్పిటల్ కు తీసుకు పోతారా? లేదా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నిర్మల్ కు తీసుకొని పోతారా అని ప్రశ్నించారు. ప్రథమ చికిత్స అతనికి ఏమీ ఇవ్వకుండా ఆగమేఘాల మీద నిర్మల్ హాస్పిటల్ కి తీసుకొని పోయారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే అని ఆరోపించారు.
ఈ ఘటన పై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాథోడ్ సురేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బీఎస్పీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.