Railway food: రైళ్లలో ఆహార పదార్థాల మెనూ, రేట్ లిస్ట్ ప్రదర్శన తప్పనిసరి.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

by vinod kumar |
Railway food: రైళ్లలో ఆహార పదార్థాల మెనూ, రేట్ లిస్ట్ ప్రదర్శన తప్పనిసరి.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహార పదార్థాలకు సంబంధించిన మెనూ, వాటి ధరలను ప్రదర్శించడం తప్పనిసరి అని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) లోక్ సభకు తెలిపారు. సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. ‘ప్రయాణికులకు సమాచారం కోసం అన్ని ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలను ఐఆర్ సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం’ అని పేర్కొన్నారు. అన్ని వివరాలతో కూడిన ప్రింటెడ్ మెనూ కార్డులు వెయిటర్ల వద్ద అందుబాటులో ఉంటాయని, డిమాండ్ మేరకు ప్రయాణీకులకు అందిస్తారని తెలిపారు. భారతీయ రైల్వైల్లో క్యాటరింగ్ సేవల మెనూ, చార్జీలపై ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి మెనూ, చార్జీ లింకుతో ప్రయాణికులకు మెసేజ్ పంపిస్తామని స్పష్టం చేశారు.

అంతేగాక ట్రైన్లతో ఆహార నాణ్యతను నింతరం తనిఖీ చేస్తున్నామని, ఆహార నమూనాలను క్రమం తప్పకుండా సేకరిస్తున్నామని వెల్లడించారు. రైళ్లలో ఐఆర్‌సీటీసీ సూపర్‌వైజర్లను కూడా నియమిస్తున్నామని, ఆహార ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టామని, వంటగది పేరు, ప్యాకేజింగ్ తేదీ వంటి వివరాలను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తున్నామని తెలిపారు.



Next Story

Most Viewed