Starlink: స్టార్‌లింక్‌కు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

by S Gopi |   ( Updated:2025-03-13 04:12:30.0  )
Starlink: స్టార్‌లింక్‌కు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ సేవలు భారత్‌కు రావడం పట్ల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. దీనివల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల్లో రైల్వే ప్రాజెక్టులకు సహాయపడుతుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశీయ ప్రధాన టెలికాం కంపెనీలు జియో ప్లాట్‌ఫామ్‌, భారతీ ఎయిర్‌టెల్ అనూహ్యంగా స్టార్‌లింక్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కంపెనీల ప్రకటనలు వచ్చినప్పటికీ స్టార్‌లింక్ సేవలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అవసరమైన రెగ్యులేటరీ క్లియరెన్స్ ఇంకా రావాల్సి ఉంది. అయితే, అశ్విని వైష్ణవ్ తాజా వ్యాఖ్యలు దీనిపై సానుకూల సంకేతాలనిచ్చాయి. శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. జియో, ఎయిర్‌టెల్ ప్రకటించిన ఒప్పందంలో భాగంగా, స్టార్‌లిన్ పరికారాలను తమ రిటైల్ అవుట్‌లెట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయించనున్నారు.


Also Read..

Infosys Narayana: పేదరిక నిర్మూలనకు ఉద్యోగాలివ్వాలి, ఉచితాలు కాదు: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి



Next Story

Most Viewed

    null