- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గంభీర్ సంచలన నిర్ణయం

- ఇండియా ఏ టీమ్‌తో ఇంగ్లాండ్ పర్యటనకు
- జూనియర్ టీమ్స్‌తో తొలి సారి హెడ్ కోచ్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం భారత సీనియర్ జట్టు సభ్యులు రెండు నెలల పాటు వారి ఫ్రాంచైజీల తరపున ఐపీఎల్ ఆడనున్నారు. అయితే ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంతో గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇండియా 'ఏ' జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయ్యారని సమాచారం. కొన్నేళ్లుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోని కోచ్‌లనే ఇండియా ఏ, అండర్ 19 జట్లకు కోచ్‌లుగా విదేశీ పర్యటనలకు పంపిస్తున్నారు. గతంలో ఎన్‌సీఏ కోచ్‌లుగా పనిచేసిన రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్‌లు ఇలాగే విదేశీ పర్యటనలకు వెళ్లారు. అయితే ద్రవిడ్ భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ జూనియర్ జట్లతో విదేశాలకు వెళ్లాడు. హెడ్ కోచ్‌లుగా ఉండగా ద్రావిడ్, రవిశాస్త్రి ఏనాడూ జూనియర్ జట్లతో పర్యటనలకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు గంభీర్ మాత్రం జూనియర్ జట్టుతో ఇంగ్లాండ్ వెళ్లాలని భావిస్తున్నాడు. అయితే గంభీర్ సాధారణ ప్రేక్షకుడిగా ఇంగ్లాండ్ వెళ్తాడా? లేదంటే జట్టుతో పాటు సభ్యుడిగా వెళ్తాడా అనే విషయంపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో ముందుగానే అక్కడకు వెళ్లాలని గంభీర్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.