- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హన్మకొండ సభలో బండి సంజయ్ సంచలన ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: సెప్టెంబర్ 12వ తేదీ నుండి నాలుగో ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ చేశారు. పోలీస్ నిర్భంధాలను ఎదుర్కొని బీజేపీ కార్యకర్తలు కదం తొక్కారని, ఎన్ని ఆంక్షలు విధించినా తమ పోరాటం సాగుతుందని చెప్పారు. శనివారం హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర మూడో ఫేజ్ ముగింపు సభలో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ పాలనపై, ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్లో కేసీఆర్కు ఆయన కుటుంబానికి భాగస్వామ్యం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికే తనను అరెస్ట్ చేశారని అన్నారు.
మూడో ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే 'ప్రతి చేనుకు నీరు- ప్రతి చేతికి పని' ఇస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడత ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ ఉచిత విద్యా, వైద్యం అందజేస్తామని చెప్పామని, రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ఫసల్ బీమా యోజన అమలు, అర్హులైన వారందరికి ఇండ్లు నిర్మిస్తామని చెప్పామని, ఇచ్చిన హామీలకు బీజేపీ ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు.
Also Read : ముగిసిన బండి సంజయ్ మూడో ఫేజ్ ప్రజాసంగ్రామ యాత్ర