- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Bandi Sanjay: ట్విట్టర్ స్టార్‌డమ్ కోసమే మీ ప్రయత్నాలు.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: ఓటు నోటు కేసు విచారణలో అసమర్థ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పడు కేటీఆర్ ట్విట్టర్ స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని లాగాలని చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం బండి సంజయ్ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. "తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ ను జైల్లో వేసే వాళ్లం" అని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బండి సంజయ్ పై విమర్శలు చేశారు. దీనికి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఇంటికి స్వాగతం కేటీ రామారావు, జెట్ లాగ్ సహా మీరు కలిగి ఉన్నవన్నీ మీపై ప్రభావం చూపుతున్నట్లు ఉన్నాయని వ్యంగ్యంగా అన్నారు. అలాగే ఏసీబీ ఓటుకు నోటు కేసు నమోదు చేసిందని, మీ అసమర్థమైన బీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరాల తరబడి దానిని రక్షించలేకపోయిందని చెప్పారు. 2015 నుండి, మీ అసమర్థ ప్రభుత్వం విచారణను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైందని, కానీ ఇప్పుడు అందరి చూపు మీవైపు ఉండటం కోసం, ట్విట్టర్ లో మీ స్టార్‌డమ్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని లాగుతున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో మీకు నిజంగా న్యాయం కావాలంటే సీబీఐ లేదా ఈడీకి బదిలీ చేసి ఉండాల్సిందని, ఈ విషయంలో రాహుల్ గాంధీ గైర్హాజరీని మీరు మసకబారిన వ్యక్తిగా భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోందని రాసుకొచ్చారు.
కాగా కేటీఆర్ ట్విట్టర్ లో.. ప్రియమైన బండి సంజయ్!, బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా కేసీఆర్‌గారిని జైల్లో పెట్టడం పట్ల మీకున్న అత్యుత్సాహం నేను అర్థం చేసుకోగలను. కానీ! ఓటుకు నోటు కుంభకోణం కెమెరాకు చిక్కిన వ్యక్తి ఇప్పటికీ ఎలా స్వేచ్ఛగా తిరుగుతున్నాడో చెప్పండి! అని అడిగారు. ఈ ప్రశ్నలు మీరు అడగలేరని, బహుశా మీరు బడే భాయ్ & చోటే భాయ్ మధ్య సంబంధాన్ని కొంచెం ఎక్కువగా పరిశోధించాలా? అని అన్నారు. ఇక ఇన్నాళ్లకు అన్ని సాక్ష్యాలు స్పష్టంగా బయటికొస్తున్నప్పుడు ఛోటే భాయ్ ఎందుకు జైలులో లేడని, ఇన్నాళ్లూ కేంద్రంలో బీజేపీ కాదా? అంటూ.. ఏది, ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు? అని కేటీఆర్ ఎక్స్ ద్వారా రాసుకొచ్చాడు.