కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ సెటైరికల్ ట్వీట్

by Javid Pasha |   ( Updated:2023-04-10 11:10:13.0  )
కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ సెటైరికల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ కుటుంబంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి కావాల్సిన ప్రధాని మోడి చెప్పిన ఆ మూడు విషయాలు ఇవే అంటూ కామెంట్ చేశారు. ‘‘ మొదటి విషయం ప్రజలు ఎల్లప్పుడూ కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే స్తుతిస్తూ ఉండాలి. ఇక రెండోది అవినీతి సొమ్ము కేసీఆర్ కుటుంబానికి నిత్యం వస్తూ ఉండాలి. ఇక పీఎం మోడీ చెప్పిన మూడో విషయం పేదల కోసం పంపిన డబ్బు వారి అవినీతి పరివారం మాత్రమే ఉపయోగిస్తూ ఉండాలి’’ అని సంజయ్ ట్వీట్ చేశారు. ఎవరికి ఏం కావాలి, ఎంత కావాలి, ఎలా పంచాలి అనే విషయాలపై పట్టు సాధించేందుకు కేసీఆర్ నిత్యం ప్రయత్నిస్తుంటారని ఎద్దేవా చేశారు. కానీ మోడీ సారధ్యంలోని ప్రభుత్వం అవినీతి మూలాలను దెబ్బ తీస్తోందని బండి సంజయ్ ట్వీట్ చేశారు.





Advertisement

Next Story