Bandi Sanjay: ఎల్ఆర్ఎస్ పేరుతో సర్కార్ కొత్త దుకాణం.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
Bandi Sanjay: ఎల్ఆర్ఎస్ పేరుతో సర్కార్ కొత్త దుకాణం.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎల్ఆర్ఎస్ (LRS) పేరుతో తెలంగాణ సర్కార్ (Telangana Government) కొత్త దుకాణం పెట్టిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన పెద్దపల్లి (Peddpally) జిల్లా కేంద్రంలో కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ (LRS) పేరుతో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయని.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని కామెంట్ చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

హస్తం పార్టీకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు అవ్వడం కేవలం తెలంగాణ (Telangana)లోనే చూస్తున్నామని సెటైర్లు వేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి భయంతో పోటీ నుంచి తప్పుకుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాలు బీజేపీ (BJP)వైపే ఉన్నాయని.. మొదటి ప్రధాన్యతా ఓటుతోనే 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. కులగణన విషయంలో కాంగ్రెస్ కొరివితో తలగొక్కుందని కామెంట్ చేశారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీల్లో కలిపారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ కేటగిరి (BC Category) నుంచి తొలగించి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ల ఆమోదానికి ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) తెలంగాణకు ఎంతో ఇచ్చిందని.. నిధుల విషయంలో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు.

Next Story