తెలంగాణ ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం: బండి సంజయ్

by Satheesh |
తెలంగాణ ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద శనివారం బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన బీజేపీ మహాధర్నాకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు ఎంతో కష్టపడి కోచింగ్ తీసుకుంటే పేపర్ లీక్స్‌తో వారి భవిష్యత్‌ను అందకారంలోకి నెట్టారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై మాట్లాడితే తాను ఇంట్లో లేని సమయం చూసి సిట్ వాళ్లు మా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారన్నారు.

ఈ కేసులో నోటీసులు ఇవ్వడానికి ఇవాళ సిట్ అధికారులను తానే పిలిచానని తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముందు మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీఎస్పీఎస్సీలోని అసలు దొంగలను పట్టుకోవాలన్నారు. ఈ కేసులో నిందితులను శిక్షంచకపోతే తెలంగాణ ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story