- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ అధికారంలోకి వస్తే నూతన స్పోర్ట్స్ పాలసీ: బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే నూతన క్రీడల విధానాన్ని తీసుకొస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైన భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ లోని ముషీరాబాద్ సమీపంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తన సోదరుడు కోవా శ్రీనివాస్ మెమోరియల్ పేరిట నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ ను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ప్రభుత్వ భూమి కన్పిస్తే... కబ్జాలు చేస్తూ డబ్బులు దండుకుంటూ అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్న ఈ రోజుల్లో కోవా శ్రీనివాస్ మెమోరియల్ ట్రస్ట్ పేరిట డాక్టర్ కె.లక్ష్మణ్ చేస్తున్న క్రీడలను ప్రోత్సహిస్తుండటం ఆనందంగా ఉంది. ఇతర పార్టీలకు, బీజేపీకి ఉన్న తేడా ఇదే... గెలుపోటములు సహజం అని అన్నారు.
'దురద్రుష్టవశాత్తు ఈరోజు ఎన్నికలంటేనే వందల కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని మార్చేందుకు బీజేపీ కృషి చేస్తోంది. ఇందుకు ప్రజల సహకారం కూడా కావాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. మనిషి పుట్టుకైనా... చావైనా సమాజానికి స్పూర్తిదాయకంగా ఉండాలనేది నా అభిమతం. భవిష్యత్తులో మన విగ్రహం కూడా చౌరస్తా వద్ద ఉండాలంటే సమాజానికి స్పూర్తిదాయకమైన పనులు మనందరం చేయాలి. సమాజం కోసం త్యాగం చేయాలి. నేను, నా కుటుంబం అనే స్వార్ధాన్ని వీడాలి. నేను మాత్రమే బాగుండాలనే భావన ఏ మాత్రం సరికాదు' అని తెలిపారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు మద్యం తాగిస్తూ హోలీ ఆడుతూ పండుగల స్పూర్తిని, హిందూ సంస్కృతిని దెబ్బతీస్తున్నారు. అలాంటి వారి విషయంలో హిందూ సోదరులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, కానీ తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే నూతన క్రీడల విధానాన్ని అమలు చేస్తామన్నారు.