బండి పాదయాత్ర లాంఛనంగా ప్రారంభం

by Nagaya |   ( Updated:2022-11-28 10:23:10.0  )
బండి పాదయాత్ర లాంఛనంగా ప్రారంభం
X

దిశ, కరీంనగర్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భైంసా నుండి ప్రారంభించనున్న పాదయాత్రకు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత టూర్‌ను రీ షెడ్యూల్ చేస్తున్నారు. సోమవారం భైంసాలో పాదయాత్ర లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంగళవారం నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. మొదట నిర్మల్‌లో ఆడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో బండి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుండి పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. సోమవారం సాయంత్రాని కల్లా బండి సంజయ్ నిర్మల్ చేరుకొనున్నారు. బైంసా పట్టణంలోకి సంజయ్ యాత్రకు హై కోర్ట్ అనుమతి నిరాకరించినందున కోర్టు ఉత్తర్వుల మేరకే యాత్ర కొనసాగుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేసారు.

Advertisement

Next Story

Most Viewed