Help Please: నిమ్స్‌లో ‘బలగం’ సింగర్ మొగులయ్య.. దాతల్లారా సాయం చేయరా..!

by srinivas |   ( Updated:2023-04-17 11:54:31.0  )
Help Please: నిమ్స్‌లో ‘బలగం’ సింగర్ మొగులయ్య.. దాతల్లారా సాయం చేయరా..!
X

దిశ, వెబ్ డెస్క్: ‘బలగం’ సినిమా క్లైమాక్స్ పాట పాడి కోట్లాది మంది ప్రజల హృదయాలను కదిలించిన సింగర్ మొగులయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన నిమ్మ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బీపీ, షుగర్‌, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వరంగల్‌ ఆస్పత్రిలో వైద్యులు కొద్దిరోజులు చికిత్స అందించారు. అయితే ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో మొగులయ్యను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొగులయ్యకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కానీ వారిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. వారి వద్ద ఒక్క రూపాయి లేని పరిస్థితి నెలకొంది. దీంతో మొగులయ్య దంపతులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తోచిన సాయం చేయమని వేడుకుంటున్నారు. గూగుల్ పే 9059098236, ఫోన్ పే 9177254408 ద్వారా సాయం చేయాలని కోరుతున్నారు.


Advertisement

Next Story

Most Viewed