Breaking: సంపద సృష్టికర్తలు మీరే.. బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

by Indraja |
Breaking: సంపద సృష్టికర్తలు మీరే.. బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజు హైదరాబాద్ హైటెక్స్ లో బిల్డర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ రంగంలో వచ్చిన రెవెల్యూయేషన్ కి సంబంధించిన పుస్తకం విడుదలైనప్పుడు అయన ఆ పుస్తకాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు.

అందులో నిర్మాణ రంగంలో చోటు చేసుకున్న అనేక మార్పుల గురించి ఆ పుస్తకంలో ఉండడం తాను గమనించినట్లు తెలిపారు. అలానే ఎక్సిబిషన్స్ లో కూడా చూశానని.. శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటుగా సులువైన అధునాతన పద్దతులను అనుసరించడం ద్వారా నిర్మాణ రంగం చాల త్వరగా ముందుకు పోతోందని హర్షం వ్యక్తం చేశారు.

ప్రపంచంతో ముందుకు పోవాలంటే ఆ అధునాతన పద్దతులను మనం కూడా అనుసరించాల్సిన పరిస్థితి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే అధునాతన పద్దతులను అనుసరించే క్రమంలో వాటిని కొనడానికి, అలానే పనులు జరిపించుకోవడానికి బ్యాంకుల నుండి అప్పు తీసుకుని.. వర్క్ శాంక్షన్ అయ్యిందని బ్యాంకుల నుండి తీసుకున్న నగదును వినియోగించి పనులను జరిపించి.. చివరికి బిల్లులు శాంక్షన్ కాకపోవడం చేత పెద్దపెద్ద కంపెనీలు సైతం దివాళా తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

60 లలో, 70 లలో నిర్మాణ రంగంలో రెపరెపలాడిన కంపెనీలు నేడు కనుమరుగవుతున్నాయి పేర్కొన్నారు. దీనికి కారణం ఆర్థికపరమైన సమస్యలని..ఈ నేపథ్యంలో ఆర్ధికపరమైన సమస్యలను అధిగమిస్తే తప్ప పని చేయలేమని నిర్మాణ రంగ సంస్థలు చెప్తున్నాయని..ప్రభుత్వ ప్రతినిధులుగా మీరు చెప్పినవాటికి అంగీకరిస్తున్నామని వెల్లడించారు.

ఇక మిమల్ని కాంట్రక్టర్స్ గా చూడం లేదు వెల్త్ క్రియేటర్స్ గా చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థల ద్వారా చేసే పనులు జాతి నిర్మాణంలో ఎంత ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయో ప్రభుత్వ పరంగా లేనటువంటి సంస్థలు కూడా ఈ జాతి నిర్మాణంలో అంతే ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి అని తెలిపారు. ప్రభుత్వ పరంగా జీతాలు లేనప్పటీ.. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ లేనప్పటికీ మీకు మీరుగా కొన్ని వ్యవస్థలను సృష్టించుకొని.. దాని ద్వారా ఈ నిర్మాణరంగానికి చేస్తున్న కృషిని అభినందిస్తున్నాము అని పేర్కొన్నారు.

Advertisement

Next Story