'యాదగిరిగుట్టపైకి ఆటోలను అనుమతించాలి'.. సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

by Vinod kumar |
యాదగిరిగుట్టపైకి ఆటోలను అనుమతించాలి.. సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదగిరి గుట్ట పైకి ఆటోలను అనుమతించాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్‌ఎల్ఏ జగ్గారెడ్డి లేఖ రాశారు. 500 కుటుంబాలను అదుకోవాలని కోరారు. "యాదగిరిగుట్ట దేవాలయం పునరనిర్మాణం తర్వాత గుట్టపైకి ఆటో లను అనుమతించడం లేదు. దీంతో 500 ఆటో కార్మికులు తీవ్రఇబ్బందులుపడుతున్నారు. గడిచిన 500 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదు. అందరు ఫైనాన్స్‌లో లేదా ఇంట్లో మహిళలు వడ్డీలకు తెస్తే ఆటో లు తీసుకున్నవారే. ఇప్పుడు గుట్టపైకి ఆటో లో అనుమతించకపోవడం తో వారు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

ఆటో ఫైనాన్స్‌లు, వడ్డీకి తెచ్చిన పైసలు కట్టలేక, ఇంటి కిరాయలు, పిల్లల ఫీజు లు కట్టుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో లను గుట్టపైకి అనుమతించాలి. భక్తులకు సైతం ఇది సౌకర్యంగా ఉంటుంది. యాదగిరి దేవస్థానానికి ఎక్కువగా మధ్య, పేద తరగతి కుటుంబాలకు సంబందించిన వారు వస్తారు. గుట్టపైకి వెళ్ళాలి అంటే వారికి ఆర్ధికంగా ఆటో ఐతే సులువుగా ఉంటుంది. గుట్టపైకి ఆటో లు అనుమతిస్తే ఆటో కుటుంబాలను ఆదుకోవడం తో పాటు భక్తులకు సైతం సౌకర్యం కల్పించిన వారు అవుతారు. ప్రభుత్వం వెంటనే దీని పై స్పందించాలని కోరుతున్న.." అని పేర్కొన్నారు.

Advertisement

Next Story