- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రంలో మరో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: వరుసగా అత్యాచార ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై జరిగిన సామూహిక లైంగికదాడి, నల్లగొండ జిల్లాలో దివ్యాంగ మహిళపై లైంగికదాడి, నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై డ్రైవర్ లైంగికదాడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ ఘటనలను ఇంకా మరువకముందే కామారెడ్డిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story