కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. ఆస్పత్రి వద్ద పరిగెత్తిన హరీష్ రావు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-01 03:50:34.0  )
కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. ఆస్పత్రి వద్ద పరిగెత్తిన హరీష్ రావు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. సూరంపల్లిలో ప్రభాకర్ రెడ్డి ఇటింటి చేశారు. అనంతరం అక్కడ ఓ పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి ఎంపీ బయటకు వస్తుండగా నిందితుడు రాజు పొట్ట‌పై భాగంలో కత్తితో దాడి చేశాడు. ఇక ఎంపీని తొలుత గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా 108లో ఎంపీని ఆస్పత్రికి చేర్చగా కారులో వచ్చిన మంత్రి హరీష్ రావు దిగి అంబులెన్స్ వెనక పరిగెత్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి స్ట్రెచర్‌ను స్వయంగా తోసుకుంటూ వైద్యులతో లోనికి వెళ్లారు. ఇక హరీష్ రావు పరిగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

Advertisement

Next Story