Rajasingh: తెలంగాణలో ఎంఐఎం గుండా రాజ్యం: రాజాసింగ్

by Prasad Jukanti |   ( Updated:2025-01-20 06:24:32.0  )
Rajasingh: తెలంగాణలో ఎంఐఎం గుండా రాజ్యం:  రాజాసింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఎంఐఎం గూండారాజ్యం పెరిగిపోతోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) మండిపడ్డారు. అంబర్‌పేట ప్లై ఓవర్ సైన్‌బోర్డు ఉర్దూలో రాయలేదని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin owaisi) వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఎంపీ బెదిరిస్తే సైన్‌బోర్డు మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడిన రాజాసింగ్.. ఎంఐఎం (MIM) ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లను పట్టుకుంటున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్‌ను తిట్టారని గుర్తు చేశారు. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే జై మోడీ, జై యోగి అని అంటారని పేర్కొన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed