- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడు కాంగ్రెస్‌లో ఆశావాహుల టెన్షన్!
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది. ఇక ప్రజాక్షేత్రంలో ప్రచారం పై దృష్టి సారించడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది. టికెట్ కోసం తీవ్ర పోటీ నడుమ అధిష్టానం మాత్రం పాల్వాయి స్రవంతి వైపుకే మొగ్గు చూపింది. ఈ వ్యవహరం మునుగోడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. అభ్యర్థి విషయంలో స్పష్టత రావడంతో ఆశావాహులపై టెన్షన్ మొదలైంది. టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని మొదట్లో అందరూ చెప్పినా తీరా క్యాండిడేట్ ఖరారు తర్వాత వారంత జట్టుగా పని చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం కాబోతున్నారు.
నేడు ముఖ్య నాయకుల భేటీ:
మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో శనివారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం కారున్నారు. గాంధీ భవన్ లో జరిగే ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ ఛార్జి కార్యదర్శి బోసురాజు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంపీలు, ఆశావాహులు, ముఖ్య నాయకులు హాజరు అవుతారని తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు అవుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
పక్క పార్టీలోకి జంప్ కాకుండా చర్యలు:
మునుగోడు సిట్టింగ్ స్థానం కావడంతో పాటు మరో ఏడాదిన్నరలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాబోయే ఉప ఎన్నిక టికెట్ కోసం నలుగురు పోటీ పడ్డారు. స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాస్ నేత పేర్లు బలంగా వినిపించాయి. కానీ స్రవంతి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. తమకు టికెట్ దక్కకపోవడంతో ఆశావాహులు ఇతర పార్టీల వైపు చూసే అవకాశాలు ఉండే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ఇవాళ జరిగే మీటింగ్ లో బుజ్జగింపులు, ప్రచారంపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వైఎస్సార్ టీపీ లాంటి పార్టీలు ఇతర పార్టీలోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకుని మునుగోడు బరిలో దింపాలనే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అటువైపుగా నేతలను వెళ్లకుండా కట్టడి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆశావాహుల మధ్య సమన్వయం కోసం ఇవాళ జరిగే మీటింగ్ లో మునుగోడు కాంగ్రెస్ కు కీలకం కానుంది.
Also Read : రేవంత్‌కు చుక్కెదురే.. మనుగోడులో పంతం నెగ్గించుకున్న సీనియర్లు