దైవ సాక్షిగా.. అనుముల రేవంత్‌రెడ్డి అను నేను..

by Sathputhe Rajesh |
దైవ సాక్షిగా.. అనుముల రేవంత్‌రెడ్డి అను నేను..
X

దిశ, తెలంగాణ బ్యూరో : దైవ సాక్షిగా.. అనుముల రేవంత్‌రెడ్డి అను నేను.. అంటూ తెలుగులోనే రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల, నిజమైన విశ్వాసం, వినయం చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతంగానీ రాగద్వేషాలుగానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను... అంటూ తెలంగాణ ముఖ్యమంతిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విధి నిర్వహణలో గోప్యతను పాటిస్తానని కూడా ప్రమాణం చేశారు. “నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికీ తెలియపర్చనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను...” అని ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

Next Story

Most Viewed