Arrest: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డికి బెదిరింపు లేఖ.. ముగ్గురు నిందితుల అరెస్ట్

by Shiva |   ( Updated:2025-01-16 05:01:11.0  )
Arrest: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డికి బెదిరింపు లేఖ.. ముగ్గురు నిందితుల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy)కి మావోయిస్టుల (Maoists) బెదిరింపు లేఖ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఎమ్మెల్యే పేరిట లేఖ రాసిన నిందితులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో A1 షేక్ రఫీ (Shaik Rafi)తో పాటు కుమ్మరి భగవంతు (Kummari Bhagavanthu), మహమ్మద్ షా అలీ‌లను అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు షేక్ తౌఫిక్ పరారీలో ఉన్నట్లుగా ఎస్పీ జానకి (SP Janaki) వెల్లడించారు. అయితే, కేసులో ప్రధాన నిందితుడు షేక్ రఫీ (Shaik Rafi) గతంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) దగ్గర పని చేశాడని తెలిపారు. అనంతరం అక్కడ పని మానేశాక ఎమ్మెల్యే‌‌పై కక్ష పెంచుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఎలాగైనా.. ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించాలనే కుట్రతో మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రాశారని పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుల నుంచి 29 డూప్లికేట్ లెటర్ల్ ప్యాడ్స్, 3 సెల్‌ఫోన్లు, ఓ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జానకీ తెలిపారు.

కాగా, వారం రోజుల క్రింతం రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు మావోయిస్టుల పేరిట లేఖను అంటించారు. ఈ ఘటనపై అదే గ్రామానికి చెందిన రవి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ఛాలెంజ్‌‌గా తీసుకున్న జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి ఇవాళ కేసును ఛేదించారు.

Next Story