రైతులకు శుభవార్త.. రెండో దశ రుణమాఫీకి రంగం సిద్ధం

by Gantepaka Srikanth |
రైతులకు శుభవార్త.. రెండో దశ రుణమాఫీకి రంగం సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే తొలి విడతగా లక్ష రూపాయల వరకు ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రస్తుతం రెండో దశ రుణమాఫీకి ఏర్పాట్లు చేస్తున్నది. ఈనెల 30న అసెంబ్లీ ఆవరణలో లక్షా యాబై వేల లోపు ఉన్నవాటిని రెండో విడతలో భాగంగా మాఫీ చేయడానికి కసరత్తు మొదలెట్టారు. తాజాగా.. ఇదే విషయాన్ని జైపాల్ రెడ్డి వర్ధంతి సభలోనూ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోసారి రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు విడతల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే.. జులై 18వ తేదీని మొదటి పూర్తి కాగా.. జూలై 31 లోపు రెండో విడత కింద లక్షన్నర వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అనంతరం ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని.. తిరిగి వచ్చిన తర్వాతే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఈ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed