Nagarjuna Lawyer: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. హీరో నాగార్జున తరపు లాయర్

by Gantepaka Srikanth |
Nagarjuna Lawyer: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. హీరో నాగార్జున తరపు లాయర్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై నటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావా కేసుపై హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు(Nampally Court) ఇవాళ విచారణ చేపట్టింది. నాగార్జున(Akkineni Nagarjuna)కు వ్యతిరేకంగా మంత్రి కొండా సురేఖ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ సురేఖ కౌంటర్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని నాగార్జున తరపు లాయర్ అకోశ్ రెడ్డి వాదనలు వినిపించారు. నాగార్జున ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, గాంధీ జయంతి సందర్భంగా బాపు ఘాట్‌లో నివాళులు అర్పించి కొండా సురేఖ మీడియాతో కేటీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. నాగార్జున కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అలాగే పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌కి కౌంటర్ ఇస్తూ కొండా మంత్రి సురేఖ నాంపల్లి స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఈరోజు కోర్టు విచారణ చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed