రెవెన్యూలో బదిలీలు చేపట్టండి

by Praveen Kumar Siramdas |
రెవెన్యూలో బదిలీలు చేపట్టండి
X

రెవెన్యూలో బదిలీలు చేపట్టండి

– సీఎం సలహాదారుని కోరిన ట్రెసా

దిశ, తెలంగాణ బ్యూరో:

రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ కోరింది. శనివారం ట్రెసా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్ ల బృందం ఆయన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. సాధారణ ఎన్నికల సందర్బంగా బదిలీ అయిన తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేయాలని కోరారు. బదిలీల అవసరాన్ని గుర్తు చేశారు. కుటుంబాలకు దూరంగా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్వపు జిల్లాలకు బదిలీ చేసేందుకు చొరవ చూపాలని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ సెషన్ ముగిసిన తర్వాత తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ లతో పాటు నిజామాబాదు జిల్లా అధ్యక్షులు ఎల్.రమణ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed