- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Ponguleti: మంత్రి పొంగులేటి కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెని భుగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ. 1194 కోట్లతో టెండర్ దక్కించుకుంది. అయితే టెండర్ దక్కించుకున్న సంస్థ సంవత్సరం అవుతుంది. అయినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించక పోవడంతో ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. నెల లోపు వెంటనే పనులు ప్రారంభించాలని తెలిపింది. ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంబించక పోతే కంపెనీపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు కేంద్ర ఇచ్చిన గడువులోగా పూర్తి కాకపోతే.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ నిలిచిపోతుందని.. అధికారులు చెప్పుకొచ్చారు. మరీ ఏపీఈపీడీసీఎల్ ఇచ్చిన నోటీసులపై మంత్రి పొంగులేటి కంపెనీ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.