NOROVIRUS: హైదరాబాద్ లో విజృంభిస్తున్న మరో వైరస్.. ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ

by Prasad Jukanti |
NOROVIRUS: హైదరాబాద్ లో విజృంభిస్తున్న మరో వైరస్.. ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వైరస్ పంజా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనేలేది అప్పుడే మరో వైరస్ కలకలం రేపుతున్నది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్ హైదరాబాద్ లోనూ విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేసింది. నొరో వైరస్ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలంటూ శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పలు సూచనలు చేసింది. కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయని తెలిపింది. చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, కాచి చల్లాల్చి వడపోసిన నీటిని తాగాలి. ఇంటిని పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం ఈ నొరో వైరస్ కేసులు హైదరాబాద్ లోని యాకత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలీ, మొఘల్ పురాతో పాటు పలు ప్రాంతాల్లో నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ బారిన పడిన వారు ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.



Next Story

Most Viewed