- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్! బీఎస్పీలోకి ముఖ్యనేత
దిశ, పేట్ బషీరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత త్వరలో బహుజన సమాజ్ పార్టీలోకి వెళ్లనున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ రాంజీ గౌతం, స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్‌లు కుత్బుల్లాపూర్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేత , మాజీ డీసీసీ అధ్యక్షులు కెఎం ప్రతాప్ ఇంటికి వచ్చి ఆయన కుమారుడు కేపీ విశాల్ గౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో బంగారు తెలంగాణ నినాదంతో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.
"సేవ్ కుత్బుల్లాపూర్" నినాదంతో ముందుకు..
ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న వందల ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేసి నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని, దానికి కొందరు ముఖ్య నేతలు సహకరిస్తున్నారని పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యేని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కైసర్ నగర్, అంగడెట్, పేట్ బషీరాబాద్ తదితర ప్రాంతాలలో కబ్జాకు గురయిన భూముల రక్షణ కోసం " సేవ్ కుత్బుల్లాపూర్ " నినాదంతో బీఎస్పీ పార్టీ వేదికగా పోరాటం చేస్తానని కేపీ విశాల్ స్పష్టం చేశారు. కె ఎం ప్రతాప్ ఆశయ సాధనలో భాగంగా నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. త్వరలో బీఎస్పీ పార్టీలో చేరిక తేదీని ప్రకటిస్తామని తెలిపారు.