టీ-కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత!

by GSrikanth |
టీ-కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి కమలం గూటికి చేరనున్నారు. ఈ విషయమై ఆయన ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో హుస్నాబాద్ హస్తం పార్టీలో చిచ్చు మొదలైంది. గత పార్లమెంట్​ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌లో చేరిన ప్రవీణ్‌రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నారని బొమ్మ శ్రీరాం టీపీసీసీని ప్రశ్నించారు. 50 ఏండ్లుగా నియోజకవర్గంలో తన తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న పార్టీకి చేసిన సేవలకు గుర్తింపు ఇదేనా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే చేరిక విషయాన్ని పార్టీ అధిష్టానం జిల్లా నాయకత్వానికి చెప్పకపోవడం ఏమిటని ఫైరయ్యారు. దీంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్న బొమ్మ శ్రీరాం చక్రవర్తి కాసేపట్లో కమలం గూటికి చేరుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed