- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC లీకేజీ కేసులో మరో కీలక పరిణామం
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలు తీసుకోవాలని ఈడీ డిసైడ్ అయింది. వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ప్రశ్నాపత్రాల లీక్ కోసం భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. మనీ లాండరింగ్ పెద్ద మొత్తంలో జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
సిట్ అధికారులు సాక్షిగా పేర్కొన్న శంకరలక్ష్మీ పై ఈడీ ఫోకస్ చేసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ కంప్యూటర్ నుంచే ప్రశ్నాపత్రం లీక్ అవ్వగా.. శంకరలక్ష్మీతో పాటు కమిషన్ కు చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను కస్టడీకి తీసుకుని ఈడీ విచారించనుంది.