తెలంగాణలో బయటపడ్డ మరో భారీ మోసం.. చిట్కాలు చెబుతూ రూ.10 కోట్లకు పైగా స్కామ్..!

by Satheesh |
తెలంగాణలో బయటపడ్డ మరో భారీ మోసం.. చిట్కాలు చెబుతూ రూ.10 కోట్లకు పైగా స్కామ్..!
X

దిశ, క్రైమ్ బ్యూరో: యూట్యూబ్ ఛానెల్ ద్వారా రియల్ ఎస్టేట్‌లో సులభంగా ఎలా సంపాదించాలి, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ఏలా పెట్టాలంటూ సలహాలు, చిట్కాలు ఇస్తు దాదాపు 30 నుంచి 40 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసిన కేసులో మొల్ళ శివయ్య, అతని భార్య స్వర్ణ లత, కుమారుడు జశ్వంత్, న్యాయవాది శ్రీనివాస్ రావులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, వారి ఆస్తులను అటాచ్ చేసినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. శివయ్య మీమాంస యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా మీమాంస వెల్ నెస్, రిసార్ట్స్ పేరుతో బీపీ, డయాబీటీస్ , థైరాయిడ్ ఇంకా అనేక రోగాలను నయం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. అతను నేచురోపతి డాక్టర్ అంటూ చలామణీ అవుతున్నాడని, దీనికి సంబంధించిన శివయ్యకు ఏలాంటి ప్రభుత్వం పరంగా గుర్తింపు సర్టిఫికెట్‌లు గానీ, అర్హతలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.

కాబట్టీ ప్రజలు నమ్మొద్దని పోలీసులు కోరుతున్నారు. మీ దృష్టికి ఇలాంటి మోసపూరిత ప్రచారానికి సంబంధించిన విషయాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీసీఎస్ డిటెక్టివ్ విభాగం డీసీపీ కోరారు. శివయ్య, అతని కుటుంబం రియల్ ఎస్టేట్‌కు సంబంధించి వాణిజ్య పరమైన స్థలాల్లో 50 శాతం పెట్టుబడి పెట్టి, మిగతా 50 శాతం పెట్టుబడిని అతని కంపెనీల ద్వారా పెడితే 200 శాతం లాభాలు ఇస్తానని నమ్మించి మోసం చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు. ఈ నేపధ్యంలోనే శివయ్య అతని కుటుంబ సభ్యలపై సీసీఎస్‌తో పాటు, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లలో కూడా కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story