ఎనిమల్ వెల్ఫేర్ సభ్యులు స్వామి స్వయం భగవాన్ మృతి

by Hajipasha |
ఎనిమల్ వెల్ఫేర్ సభ్యులు స్వామి స్వయం భగవాన్ మృతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యులు స్వామి స్వయం భగవాన్ దాస్ మృతి పట్ల పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యులుగా స్వామి అందించిన సేవలను స్మరించుకున్నారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్‌డీ కళ్యాణ్ కుమార్ లు స్వామి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా స్వామి భగవాన్ ఎనిమల్ వెల్ఫేర్ కు అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఒరిస్సా వరదల సమయంలో మూగ జీవాలకు గ్రాసం అందించడంలో కృషి చేసారని తెలిపారు. జంతు సంరక్షణ రంగంలో భగవాన్ సేవలు అపరమైనవని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed