స్మితా సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించిన ఆనంద్‌కుమార్‌పై వేటు

by GSrikanth |   ( Updated:2023-01-23 08:37:17.0  )
స్మితా సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించిన ఆనంద్‌కుమార్‌పై వేటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహశీల్దార్‌పై అధికారులు వేటు వేశారు. జూబ్లీహిల్స్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడిన ఆనంద్‌ కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మూడ్రోజుల క్రితం స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి చొరబడిన డిప్యూటీ తహశీల్దార్‌ ఆనంద్ కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి చంలచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడు ఆనందకుమార్‌రెడ్డికి రెవెన్యూ అధికారులు సస్పెన్షన్‌ ఆదేశాలు అందించనున్నట్టు సమాచారం.

కాగా, జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఆనంద్ కుమార్ రెడ్డి చొరబడ్డారు. అనంతరం స్మితా సబర్వాల్ అరవడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అతడి ఫ్రెండ్‌ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు స్పష్టం చేశారు. తన ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ చొరబాటుపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడా స్పందించారు. తనకు బాధాకరమైన అనుభవం ఎదురైందని ట్వీట్ చేశారు.

Also Read...

317 జీవో: సర్కారుపై బండి సంజయ్ ఫైర్

Advertisement

Next Story

Most Viewed