బ్రతికున్నాచనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదు: ప్రజావాణిలో వృద్ధురాలి ఆవేదన

by Anjali |
బ్రతికున్నాచనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదు: ప్రజావాణిలో వృద్ధురాలి ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చింది.. ఇప్పుడు మాత్రం పెన్షన్ కూడా ఇవ్వడం లేదంటూ ఓ వృద్ధురాలు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రతికున్నా చనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకెళ్తే.. ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన 59 ఏళ్ల రుక్నమ్మ భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు చేసుకుంది. రుక్నమ్మ కూడా చనిపోయినట్లు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు అంటున్నారని రుక్నమ్మ కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడుతుంది. కేసీఆర్ హయాంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరైందని, ఇప్పుడు మాత్రం పెన్షన్ ఇవ్వడం లేదని రుక్నమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed