బలహీనపడి అల్పపీడనం గా మారిన వాయుగుండం

by Mahesh |   ( Updated:2024-09-03 15:51:24.0  )
బలహీనపడి అల్పపీడనం గా మారిన వాయుగుండం
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి.. తెలుగు రాష్ట్రాలలు భారీ వర్షాలతో అతలాకుతలం చేసింది. దీంతో అనేక జిల్లాల్లో వదరలు రావడంతో జనజీవన ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఏపీలో విజయవాడ మహానగరం అయితే నేటికి కూడా వరదల్లో చిక్కుకుని ఉంది. ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఆదివారం తీరం దాటినప్పటికీ.. మంగళవారం తెల్లవారు జామున బలహీన పడినట్లే వాతావరణ శాఖ తెలిపింది. బలహీన పడిన వాయుగుండం.. ప్రస్తుతం అల్పపీడనంగా మారిందని.. అది.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ అల్పపీడనం కారణంగా.. కోస్తాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని.. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడునుందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed