తాయత్తులే ప్రాణం తీశాయా?.. లాస్య నందిత మరణంలో కొత్త కోణం

by Prasad Jukanti |   ( Updated:2024-02-24 11:43:11.0  )
తాయత్తులే ప్రాణం తీశాయా?.. లాస్య నందిత మరణంలో కొత్త కోణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో.. కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆమె మృతికి గల కారణాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ యాక్సిడెంట్ మానవతప్పిదమా లేక దీని ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో లాస్య మరణంపై తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. పోస్ట్ మార్టం అనంతరం వెలుగు చూసిన సంచలన విషయాలు లాస్య నందిత మరణం వెనుక సెంటిమెంట్ కోణం చర్చకు దారి తీస్తోంది.

లాస్య ఒంటిపై తాయత్తులు!:
రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య నందిత మృతదేహానికి గాంధీ వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సమయంలో ఆమె మృతదేహానికి 12 తాయత్తులను గుర్తించిన వైద్యులు వాటిని పోలీసులకు అప్పజెప్పినట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే ఆమె అనారోగ్యానికి గురై కొద్దిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఓ కార్యక్రమానికి హాజరై మూడున్నర గంటల పాటు లిఫ్ట్ లో చిక్కుకున్నారు. ఈనెల 13న నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదలో ఆమె మృత్యుచేతికి చిక్కారు. ఇదిలా ఉంటే వరుస ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడేందుకు లాస్య నందిత తాయత్తుల సెంటిమెట్ ను నమ్ముకున్నారా? చివరకు ఆ తాయత్తు కోసమే వెళ్ళి వస్తూ ప్రాణాలు కోల్పోయారా అనే చర్చ తెరమీదకు వస్తోంది.

వారి సూచనలతోనే బాబాల వద్దకు?:

సన్నిహితుల సూచనలతోనే ఆమె పలు ఆలయాలు, బాబాల వద్దకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేయించుకుని తాయత్తులు కట్టించుకున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా తాను క్షేమంగా బయటపడవచ్చనే సెంటిమెంట్ తోనే ఆమె ఇలా చేసి ఉండవచ్చని భావించినా చివరకు ఆ తాయత్తు కోసమే సదాశివపేట సమీపంలోని ఓ బాబా వద్దకు వెళ్లివస్తూ ప్రాణాలు కోల్పోయారనే పలువురు చెప్పుకుంటున్నారు.


Advertisement

Next Story